135 రోజుల్లో.. 6 వేల కిలోమీటర్ల పరుగు

దిల్లీకి చెందిన సూఫియా అనే యువతి 135 రోజుల్లో దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యంగా పరుగును ప్రారంభించారు. సుమారు ఆరు వేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.....

Published : 15 Feb 2021 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీకి చెందిన సూఫియా అనే యువతి 135 రోజుల్లో దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యంగా పరుగును ప్రారంభించారు. సుమారు ఆరువేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తన పరుగు కొనసాగుతోంది. దిల్లీ నుంచి ముంబయి, చెన్నై, కోల్‌కతా మీదుగా దిల్లీ చేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవాలనే ధ్యేయంతో పరుగును ప్రారంభించినట్లు సూఫియా తెలిపారు. ఈ పరుగు ప్రయాణంలో ఎంతో మంది ప్రజలను కలుస్తున్నానని, వారితో అనేక విషయాలను పంచుకుంటున్నట్లు సూఫియా పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

అత్యంత వేగంగా ఆవర్తన పట్టిక రాసి రికార్డు

కేకుతో రామసేతు.. రామమందిరానికి విరాళం

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని