వెబ్‌సిరీస్‌ చూసి.. ప్రాణాల మీదకు తెచ్చుకొని

ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ రోజు ఉదయం ఓ టీనేజర్‌ కిటికిలోకి దూకి బయటకువద్దామకుని అందులో ఇరుక్కుపోయింది

Published : 17 Jun 2021 21:37 IST

 సినిమా సన్నివేశాన్ని తలిపించేలా అమెరికాలో ఓ ఘటన

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ ఇంట్లో వాళ్లు తాళం వేసి బయటికి వెళ్లారు.. ఆ సమయంలో మీరొక్కరే ఇంట్లో ఉన్నారు.. వాళ్లుతిరిగి ఇంటికి వచ్చి తాళం తిద్దామంటే తాళంచెవి కనిపించలేదు. ఇంట్లో మీరు.. బయట వాళ్లు.. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. ఇక తలుపు తీయడానికి పండే తంటాలు అన్నిఇన్ని కావు కదూ.. ఇప్పుడా తలుపు తెరవాలంటే ప్రధానంగా మన మెదడులోకి వచ్చే రెండు ఆలోచనలు..ఒకటి  స్పేర్‌ కీ.. లేదా కొత్తతాళం చెవి తయారు చేయించి తలుపు తీయాలా అనే కదూ.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా...  సరిగ్గా ఇదే ఘటన అమెరికాలోని నెవడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ అమ్మాయి(18) తన ఇంట్లో ఇదే తరహాలో ఇరుక్కుపోయింది. మరి ఎలా బయటపడాలి అని అనుకుంటుండగా.. రోజు తాను చూసే ఓ టీవీ సిరీస్‌లో సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది. అంతే వెంటనే చిమ్ని(కిటికి) నుంచి బయటికి వచ్చేద్దామని అందులోకి దూరింది. కానీ బయటకు వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక వెంటనే ఆమెను కాపాడాలంటూబయట ఉన్న వారు  ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేశారు. ఈ విషయాన్నంతా ఆ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వారి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది.‘‘ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ రోజు ఉదయం ఓ టీనేజర్‌ కిటికిలోకి దూకి బయటకువద్దామనుకొని అందులో ఇరుక్కుపోయింది. అయితే ఆమెని రక్షించేందుకు ప్రత్యేక రోప్‌ సిస్టం ఉపయోగించాం. అరగంట పాటు కృషి చేసి అమ్మాయిని బయటికి తీసుకొచ్చాం. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో  అదృష్టవశాత్తూ ఆమెకేమీ గాయాలవ్వలేదు’’. కాగా ఆమె కిటికిలో ఇరుక్కుపోవడం.. వెంటనే రెస్కూటీం కాపాడం.. అంతా ఓ చిత్రంలోని సన్నివేశాన్ని తలపించింది. కామెంట్‌ సెక్షన్లలో నెటజన్లు విభిన్నంగా స్పందించారు. ‘‘ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కన్నా తాళం వేసిన ఇంట్లో ఉండటం నయమని, ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చెయ్యొద్దు ’’ అని హితవు పలికారు. టీనేజర్‌ని కాపాడినందుకు గానూ వారి శ్రమ ప్రశంసనీయం.. ‘‘మీ వల్ల ఓ అమ్మాయి సురక్షితంగా బయటపడింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోతాం’’ అని కామెంట్లు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని