Leopard attack: చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు
కళ్లెదుట ఒక్కసారిగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వయోవృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను తన చేతి కర్రతోనే తరిమికొట్టడం గమనార్హం. ముంబయి శివారులోని...
ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్థానికంగా నివసించే నిర్మలాదేవీ సింగ్ బుధవారం రాత్రి చేతి కర్ర ఊతంతో నడుచుకుంటూ వచ్చి ఇంటి ప్రాంగణంలో కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఓ చిరుత నక్కి ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఈ క్రమంలో అదను చూసిన చిరుత.. ఆమెపై దాడికి దిగింది. అనుకోని ఘటనతో ఆమె వెనక్కుపడిపోయింది. వెంటనే తేరుకొని, తన చేతికర్రతోనే చిరుతను ప్రతిఘటించింది. దీంతో కొద్దిసేపటికి చిరుత అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో చిరుత దాడి జరగడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని రక్షించారు. ఆరే కాలనీ ముంబయి శివారు ప్రాంతం కావడం, చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో.. ఈ తరహా ఘటనలూ గతంలోనూ చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..