‘భారత్ ధూమపాన రహిత దేశం కావాలి’

భారతదేశాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తిని..

Updated : 07 Apr 2021 22:30 IST

వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన

దిల్లీ: భారతదేశాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకుగాను ది సిగరెట్స్‌ అండ్ అదర్‌ టొబాకో ప్రాడక్ట్స్‌ చట్టం-2003 (సీవోటీపీఏ-2003)లో భాగంగా ధూమపాన ప్రాంతాల(స్మోకింగ్‌ జోన్స్‌)ను అనుమతించే ప్రస్తుత నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, విమానాశ్రయాలు వంటి కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేందుకు ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగదారులు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ ఉందని సంస్థ పేర్కొంది. వీరిలో ప్రతి సంవత్సరం కనీసం 1.2 మిలియన్లు పొగాకు సంబంధిత వ్యాధుల బారినపడి మరణిస్తున్నారని వెల్లడించింది. ధూమపానం చేసేవారు సామాజికంగా దూరం లేదా ముసుగులు ధరించలేరు కాబట్టి వారికి సమీపంలో ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతోన్న బాధితులు మరిన్ని సమస్యలు ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పొగాకు నియంత్రణ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.

వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కమ్యూనికేషన్ కన్సల్టెంట్ నాగ శిరీష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని