Yediyurappa: యడియూరప్ప రాజీనామాతో కలత.. దుకాణాల మూసివేత

తమ ప్రియతమ నేత బీఎస్‌ యడియూరప్ప రాజీనామాతో ఆయన అభిమానులు కలతచెందారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలోని యడియూరప్ప నియోజకవర్గం శిఖారీపురలో....

Published : 26 Jul 2021 22:50 IST

శిఖారీపుర: తమ ప్రియతమ నేత బీఎస్‌ యడియూరప్ప రాజీనామాతో ఆయన అభిమానులు కలతచెందారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలోని యడియూరప్ప నియోజకవర్గం శిఖారీపురలో సోమవారం స్వచ్ఛంద బంద్‌ పాటించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పలువురు అభిమానులు కోరుతున్నారు.

1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప శిఖారీపుర నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి శిఖారీపుర, శివమొగ్గ నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అందులో నాలుగుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. మూడు సార్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి పార్లమెంట్‌ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బీఎస్‌ యడియూరప్ప సోమవారం ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన రోజే యడియూరప్ప రాజీనామా చేస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని