Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో  ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్‌

Published : 11 Sep 2021 02:25 IST

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో  ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని, మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ అనుమతిచ్చారు. వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు. మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని