దురదృష్టాన్నే ఇస్తోంది.. ఇది మాకొద్దు!

ఎవరైనా సరే అరుదైన వస్తువుల్ని తమ వద్దే ఉంచుకోవాలనుకుంటారు. అలాగే ఓ పర్యటకురాలు చారిత్రక కట్టడానికి సంబంధించిన మూడు వస్తువుల్ని 15ఏళ్ల కిందట దొంగిలించి, తన వద్దే పెట్టుకుంది. అయితే అవి కొట్టేసిన దగ్గర నుంచి దురదృష్టం తమను వేటాడుతోందని

Updated : 15 Oct 2020 05:17 IST

దొంగిలించిన వస్తువుల్ని తిరిగిచ్చిన పర్యటకురాలు


(ఫొటో: పాంపే ఫేస్‌బుక్‌ స్క్రీన్‌షాట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా సరే అరుదైన వస్తువుల్ని తమ వద్దే ఉంచుకోవాలనుకుంటారు. అలాగే ఓ పర్యటకురాలు చారిత్రక కట్టడానికి సంబంధించిన మూడు వస్తువుల్ని 15ఏళ్ల కిందట దొంగిలించి, తన వద్దే పెట్టుకుంది. అయితే అవి కొట్టేసిన దగ్గర నుంచి దురదృష్టం తమను వెంటాడుతోందని వాపోతూ.. ఆ వస్తువుల్ని ఆ కట్టడాన్ని పరిరక్షిస్తున్న వారికి తిరిగి పంపించింది. ఈ ఘటన ఇటలీలోని పాంపేలో చోటుచేసుకుంది.

కెనడాకు చెందిన నికోల్‌ అనే మహిళ 2005లో పాంపేని సందర్శించిందట. ఆ సమయంలో వెలకట్టలేని చారిత్రక కట్టడానికి సంబంధించి ఏదైనా వస్తువు తన వద్ద ఉంచుకోవాలని భావించి, అక్కడి సెరామిక్‌ గోడలోని చిన్న ముక్క, రెండు తెలుపు రంగు మొజాయిక్‌ టైల్స్‌ను దొంగిలించిందట. ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయాలని పాంపేలోని ఓ ట్రావెల్‌ ఏజెంట్‌కు పంపించింది. ఆ వస్తువులను పాంపే ఆర్కియాలజీ పార్క్‌లో అప్పగించాలని ఏజెంట్‌కు సూచించింది. వాటితోపాటు ఓ లేఖ కూడా పంపింది. ఆ వస్తువులు దొంగిలించినప్పటి నుంచి తనను, తన కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. వాటిని తీసుకొని కెనడాకి తిరిగెళ్లిన తర్వాత తమ ఆస్తులు కరిగిపోయాయని, 36ఏళ్ల వయసున్న తను రెండుసార్లు రొమ్ము కేన్సర్‌తో పోరాడాల్సి వచ్చిందని తెలిపింది. తన కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందని లేఖలో పేర్కొంది. ‘‘ఈ వస్తువులు దురదృష్టాన్ని మాత్రమే తీసుకొస్తాయి. ఇలాంటి వస్తువులు మాకొద్దు. మీరే వెనక్కి తీసుకోండి’ అని వస్తువులతోపాటు పంపించిన లేఖలో నికోల్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని