Updated : 30/04/2021 21:54 IST

Top 10 News @ 9 PM

1. పాస్‌ మార్కులతో భవిష్యత్‌ ఉంటుందా?: జగన్‌

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ వల్ల జరిగే ప్రయోజనాలు సహా ఏ పరిస్థితుల్లో వీటిని నిర్వహిస్తున్నామనే విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు. ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 18ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌..రాష్ట్రాలేమంటున్నాయ్‌?

విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి వేగానికి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాల్సిందిగా మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా అర్హులందరూ రిజిస్టర్‌ చేసుకునే విధంగా గత బుధవారమే కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేసింది. ఇప్పటికే దాదాపు 2.45కోట్ల మంది పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వీరందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.5 లక్షల వయల్స్‌ రెమ్‌డెసివిర్‌ దిగుమతి!

3. ఈటలపై ఆరోపణలు: విచారణకు సీఎం ఆదేశం

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూముల కబ్జా వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని, గ్రామస్థులను బెదిరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల, ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డి గ్రామస్థులను బెరిరించారని ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో 17వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,494 పరీక్షలు నిర్వహించగా.. 17,354 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,01,690 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,90,360 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* PPE కిట్లో ఉండలేక..బంధువులతో మాట్లాడలేక!

5. తెలంగాణలో వ్యాక్సిన్‌ డెలివరికి డ్రోన్స్‌

వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రయోగాత్మకంగా డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించింది. ఈ మేరకు డీజీసీఏ(డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌)అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయి. అయితే, ఏ వ్యాక్సిన్‌ అన్నది మాత్రం డీజీసీఏ స్పష్టం చేయలేదు. పౌరుల ఇంటి వద్దకే హెల్త్‌కేర్ సేవలు అందించడం, సేవల పంపిణీ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు అందించడం కూడా డ్రోన్ సేవల లక్ష్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘వాసన పరీక్ష’తో కొవిడ్‌ గుర్తింపు..!

కరోనా వైరస్‌ను సోకిన కొందరిలోనే వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తున్నాయి. మరికొందరిలో లక్షణాలు కనిపించనప్పటికీ వాసన కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాసన కోల్పోయే లక్షణమున్న కొవిడ్‌-19తో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఓ కిట్‌ను రూపొందించారు. దీని ద్వారా పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులతో పాటు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి’

7. ‘కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలాడు’

కరోనా మహమ్మారి ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో తెలియడం లేదు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుదిశ్వాస విడిచారు. ఈ హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వళ్తే.. జిల్లాలోని గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా జయశంకర్ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జయశంకర్‌ జ్వరంతో బాధపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. corona:అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారిన నటుడు

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు కొందరు నటీనటులు. ఇప్పటికే ప్రముఖ నటుడు సోనూసూద్‌ కరోనా కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేస్తూ రియల్‌ హీరో అయ్యారు. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు అర్జున్‌ గౌడ కూడా కొవిడ్‌ బాధితుల కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ఆయన ఏకంగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొడుకుతో విష్ణు అల్లరి.. కప్పతో అదాశర్మ

9. RCB x PBKS: లైవ్‌ బ్లాగ్‌ 

10. దేశం కోసం యుద్ధం చేశా.. నా కొడుకును కాపాడలేకపోయారు 

‘‘మాతృభూమిని శత్రుమూకల నుంచి కాపాడేందుకు యుద్ధంలో పాల్గొన్నా.. కానీ, నేడు ఈ వ్యవస్థ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టలేకపోయింది’’ ఓ కార్గిల్‌ సైనికుడి ఆవేదన ఇది. రెండో దశలో కరోనా మహమ్మారి మరింత ఘోరంగా విరుచుకుపడుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరీ మీదా ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన హరిరాం దుబే 31 ఏళ్ల కుమారుడు కూడా ఇటీవల కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే కన్నకొడుకును చివరిసారి చూసుకునేందుకు కూడా తాము ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Oxygen కావాలా? రావిచెట్టు కిందకి పొండి!

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం