Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jan 2022 09:07 IST

1. మూడు వారాల్లో కొవిడ్‌ ఉగ్రరూపం

దేశీయంగా ‘కొవిడ్‌’ మూడోదశ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ తాజాగా అంచనా వేసింది. నెల రోజుల నుంచి మనదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతున్న సంగతి విదితమే. నగరాలతో మొదలై ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను సైతం ఈ వ్యాధి చుట్టేస్తోంది. ఈ తీవ్రత ఎక్కువ కాలం ఉండకపోవచ్చని, వచ్చే మూడు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్నది ఎస్‌బీఐ తాజా అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. IND vs SA : కళ్లన్నీ కోహ్లీపైనే..

కోహ్లి కెప్టెన్‌గా లేని టీమ్‌ ఇండియాను ఊహించడం కష్టమే. అతడు భారత క్రికెట్‌ను అంతలా ప్రభావితం చేశాడు. తనదైన శైలిలో జట్టును నడిపించాడు. అయితే ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ అతడు సారథి కాదు. ఏడేళ్లలో తొలిసారి కేవలం ఆటగాడిగా, మరొకరి నాయకత్వంలో బరిలోకి దిగుతున్నాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కళ్లన్నీ విరాట్‌పైనే. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వ పటిమకు కూడా సిరీస్‌ పరీక్షే. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య పరిమిత ఓవర్ల పోరాటానికి రంగం సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సుంకాలు తగ్గితే పసిడి మెరుపులే

బంగారంతో పాటు విలువైన లోహాలు, ముత్యాలతో రూపొందించే ఆభరణాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 1.25 శాతానికి పరిమితం చేసి, పరిశ్రమ ఉన్నతికి సహకరించాలని అఖిలభారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం వీటిపై 3% జీఎస్‌టీ ఉంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) లేకున్నా, నగదుతో ఆభరణాలు కొనుగోలు చేసే పరిమితిని రూ.2 లక్షల నుంచి  రూ.5 లక్షలకు పెంచాలని కోరింది. గ్రామీణుల్లో అధికులకు పాన్‌కార్డు లేదని గుర్తు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కంటి‘పాప’కు ఎంత కష్టం!

చిన్నారులు రోజుకు రెండు గంటలకు మించి స్క్రీన్‌చూస్తే కంటి చూపుతో పాటు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌ ఇటీవల ఆన్‌లైన్‌ విద్యపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పాఠ్యాంశాలను తక్కువ నిడివితో వీడియోలుగా రూపొందిస్తే తేలికగా అర్థం కావడంతోపాటు కంటిపై ఒత్తిడి తగ్గుతుందని, అవసరమైతే మరోసారి వినే అవకాశం ఉంటుందని సూచించింది. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు బోధన చేపట్టగా సానుకూల ఫలితాలు కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పది రోజులు గడిచినా కొందరిలో ‘దశ’ మారదు

కొవిడ్‌-19 సోకి, 10 రోజుల క్వారంటైన్‌ కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా కొందరి నుంచి ఆ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటివారిలో క్రియాశీలక వైరస్‌ జాడను పట్టుకొనేందుకు సరికొత్త పరీక్షను ఉపయోగించారు. ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు.. ప్రామాణిక పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 176 మంది నుంచి నమూనాలను సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నాలుగో డోసు పొందినా.. ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పాక్షికమే

6. లక్షల జీవితాలకు శ్రీమహాలక్ష్ములు

‘ఆడవాళ్లకేం తెలుసు డబ్బు గురించి?’... పదేళ్ల క్రితం వరకూ తరచూ వినిపించిన మాటే ఇది. ఉన్నత చదువులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిలో మార్పుతెస్తున్నాయి. దానికి నిదర్శనంగానా అన్నట్టు... ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆర్థిక రంగంలో అద్భుతాలు చేస్తూ లక్షల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘ఫిన్‌టెక్‌’ వ్యాపార దిగ్గజాల్లో కొందరి ప్రస్థానం చూడండి...! మనకు కంటినిండా కలలుంటాయి. గుండె నిండా ఆత్మవిశ్వాసం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Tollywood: ప్రాణమంతా... పాన్‌ ఇండియా

శత  దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్‌లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్‌ ఇండియా ఇమేజ్‌. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ.. తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు కథానాయకులు. పాన్‌ ఇండియా సంస్కృతిని ఒంటబట్టించుకుని.. వేల కోట్ల క్లబ్బుల్లో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’తో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటీఎస్‌కు డ్వాక్రా అప్పు!

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని కట్టిన ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో చేపట్టిన వసూళ్ల కోసం ప్రభుత్వం డ్వాక్రా అస్త్రం ప్రయోగిస్తోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులపై అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా వసూళ్లు ఆశించినంత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. నిర్దేశించిన మొత్తాన్ని (రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20 వేలు) సేకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లగా ఇప్పటికిప్పుడు అంత మొత్తం ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తుండటంతో వసూళ్లను పెంచుకునేందుకు డ్వాక్రాను తెరమీదకు తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కీటక విజ్ఞానం

కీటకాలను మనం పెద్దగా పట్టించుకోం గానీ శాస్త్రవేత్తలకు మొదట్నుంచీ వీటిపై ఆసక్తి ఎక్కువే. వీటి స్ఫూర్తితో ఎన్నెన్నో వినూత్న పరిజ్ఞానాలను ఆవిష్కరించారు. పరికరాలను రూపొందించారు. సీతాకోక చిలుకల దగ్గర్నుంచి ఈగలు, పేడ పురుగులు, బొద్దింకల వరకూ కీటకాలన్నీ శాస్త్ర సాంకేతిక సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నవే. వీటి లోకంలోకి ప్రవేశిస్తే ఇలాంటి కొత్త సంగతులెన్నో బయటపడతాయి. ఎందుకనో కీటకాలంటే మనకు మొదట్నుంచీ భయమే. బొద్దింక కనిపిస్తే భయంతో కేకలేస్తాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అణు చరిత్రలో మరో ముందడుగు

దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో  ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో రూ.53 కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆక్సిజన్‌-18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి ఆరు అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన మన దేశం చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని