Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Aug 2021 09:10 IST

1. Paralympics‌: టేబుల్ టెన్నిస్‌లో భవీనాకు రజతం

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. టేబుల్‌ టెన్నిస్‌లో భవీనాబెన్‌ పటేల్‌ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌, చైనా క్రీడాకారిణి యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సరిదిద్దుకోకుంటే  ఎలా?

2. బడిగంటలు మోగే వేళ.. ఆచరిద్దాం ఇలా..

ఒకవైపు కరోనా భయం వెంటాడుతోంది. ఇంకోవైపు విద్యాసంస్థల గంట మోగనుంది. తల్లిదండ్రుల్లో ఏదో తెలియని సందిగ్ధం. పిల్లలను పంపాలా? వద్దా? అనే మీమాంస కొనసాగుతుండగానే సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలు మొదలుకొని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అఫ్గాన్‌ అల్లకల్లోలం వెనక...

అసహాయశూరులూ... అద్వితీయ యోధులూ... ఆంగ్లేయుల్ని ప్రజాపోరాటంతో చిత్తుచేసిన అసామాన్యులూ నమ్మితే ప్రాణాన్నిచ్చే స్నేహశీలురూ... కాయకష్టం తప్ప కల్లాకపటం తెలియనివాళ్లూ... ఇదంతా అఫ్గాన్‌ ప్రజల గురించేనంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా! దాంతోపాటూ ‘ఇన్ని ఉన్నా... వాళ్లకి ఎందుకీ దుస్థితి?’ అనే ప్రశ్నా ఉదయిస్తుంది.  దానికి జవాబు వెతికితే అఫ్గాన్‌కి సంబంధించిన ఎన్నో ప్రత్యేకతలు కళ్లెదుట నిలుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అఫ్గాన్‌ దోషి అమెరికానే!

4. కొవిడ్‌ మూలాలపై స్పష్టత కరవు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం స్పష్టతకు రాలేకపోయింది. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్‌ బయటకు వచ్చిందా? సహజంగానే పుట్టిందా? జీవాయుధాన్ని తయారుచేసేందుకే ఈ మహమ్మారిని సృష్టించారా? అన్న విషయాల్లో ఎలాంటి ముగింపునకూ రాలేకపోయింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాల మేరకు ‘కొవిడ్‌-19’ మూలాలను కనుగొనేందుకు పరిశోధన సాగించిన ‘ద డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌’... శనివారం నివేదికను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆయన్ని గెలిపించేందుకే పాడా!

మురికివాడలో ఇరుకిల్లు! అంబులెన్సు నడిపే నాన్న..  ముగ్గురు పిల్లల్నీ, ఇంటినీ చక్కబెట్టే అమ్మ. అప్పటి దాకా మూడు పూటలా తిండి కోసమూ ఇబ్బందులు పడిన ఆ కుటుంబం కథ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు తెచ్చింది ఆ ఇంటి పెద్ద కూతురే. తనే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే. గణాంకశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఈ 23ఏళ్ల గాయని.. బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే  ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి దేశం గుర్తించే గాయనిగా ఎదిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రేమ వివాహాన్నే ఇష్టపడతా

6. నాన్న ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..!

ఆరేళ్లకే రేసింగ్‌ లైసెన్స్‌! పదమూడేళ్లకే 30 ట్రోఫీలు, పతకాలు కైవసం! ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసున్న బైక్‌ రేసర్‌గా గుర్తింపు. ఇవన్నీ రహీష్‌ ఖత్రి గురించే... ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో తెలుసా?! ముంబయికి చెందిన రహీష్‌ ఖత్రికి రేసింగ్‌ బైక్‌ దొరికిందంటే చాలు.. దాన్ని అమాంతం గాల్లో తేలేలా చేస్తాడు. ఎక్కడ పోటీలు జరిగినా పక్కాగా బహుమతి ఎగరేసుకుపోతాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అంతిమ లబ్ధిదారులుగా తేలితే ఆస్తుల జప్తు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు కలకలం రేపుతోంది. 12 మంది తెలుగు సినీప్రముఖుల్ని ఈనెల 31 నుంచి ఈడీ విచారించనున్న విషయం విదితమే. నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది. నార్కోటిక్స్‌ చట్టాన్ని ఉల్లంఘించి సంపాదించిన సొమ్ము ఎవరి చేతులు మారిందనే అంశంపైనే దర్యాప్తు సాగనుంది. మాదకద్రవ్యాలను విదేశాల నుంచి తెప్పించినట్లు 2017లో విచారించిన ఆబ్కారీశాఖ గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘పుష్ప’లో నేనూ తగ్గేదే లే..!

8. విభజన 2 కాదు... 3 దేశాలుగా!

విభజించు పాలించు సూత్రంతో మనల్ని దాదాపు 200 ఏళ్లు ఏలిన బ్రిటిషర్లు... 1947లో పోతూపోతూ చివరి క్షణాల్లో కూడా తమ విభజన ఆయుధాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించారు! భారత్‌, పాకిస్థాన్‌ల రూపంలో దేశాన్ని రెండుగా చీల్చాలని నిర్ణయించాక కూడా వారి మనసు సంతృప్తి చెందలేదు. చివరి రోజుల్లో... మరో చీలికకు ఎత్తు వేశారు. అదే బెంగాల్‌! భారత్‌, పాకిస్థాన్‌లతో పాటు సంయుక్త బెంగాల్‌నూ ఓ ప్రత్యేక దేశంగా చేయాలని భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శ్రీజేష్‌... మన ‘కంచు’ కోట!

భారత్‌ తరఫున దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హాకీ గోల్‌కీపర్‌... పరత్తు రవీంద్రన్‌ శ్రీజేష్‌ ఇంట్లో ఎన్నో పతకాలూ, అవార్డులూ, జ్ఞాపికలూ... పద్మశ్రీ, అర్జున పురస్కారాలూ ఉన్నాయి. వాటన్నింటినీ చూసినపుడు అతడికెంతో గర్వంగా ఉండేది. కానీ ఆ పక్కనే ఉన్న రెండు జెర్సీలు మాత్రం ‘సాధించాల్సింది ఇంకా ఉంద’ని గుర్తుచేసేవి. ఆ రెండూ ఒలింపిక్‌(2012, 2016) జెర్సీలు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నాన్న ఇచ్చిన ఆస్తులవే!

10. Crime News: అన్నా.. అమ్మను, నన్నూ పొడిచేశాడు.. నువ్వు జాగ్రత్త!

‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్‌ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమెకు తుది పలుకులయ్యాయి. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ, కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూనే ఆ గర్భిణి సోదరుడికి ఫోన్‌ చేసింది. అప్రమత్తం చేసింది. రక్తపుముద్దలా మారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదాన్ని నింపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని