Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Aug 2021 09:14 IST

1. ఈటెలాంటి కుర్రాడు!

ఈటె విసిరి ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని ఒడిసిపట్టిన నీరజ్‌ చోప్రా ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు. నేషనల్‌ క్రష్‌. ఈ క్రీడాకారుడు ఆటలు కాకుండా బాగా అభిమానించేది ఏంటో తెలుసా? బైక్‌లు, కార్లు. ఏమాత్రం తీరిక దొరికినా లాంగ్‌డ్రైవ్‌లకు ఈటెలా దూసుకెళ్లిపోతుంటాడు. తన గ్యారేజీలో ఉన్న వాహనాలేంటో చూడండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ట్రక్‌ డ్రైవర్‌ అయ్యేవాడినేమో!

2. పౌర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి

అఫ్గానిస్థాన్‌ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పకడ్బందీ ప్రణాళిక ఏమీ లేదని తేలిపోయింది. అగ్రరాజ్య సేనలు అర్ధరాత్రి వేళ పెట్టేబేడా సర్దుకోవడం అఫ్గాన్‌ దళాల స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఆ తరవాత వారాల వ్యవధిలోనే కాందహార్‌, హెరాత్‌, లష్కర్‌ఘాలతో కలిపి 18 రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు వశపరచుకొన్నారు. కాబూల్‌కు సమీపంలోని కీలక ప్రాంతాలు సైతం వారి అధీనంలోకి వెళ్ళిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సర్కారు బడికి చలో.. చలో

రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరం (2021-22) భారీగా పెరిగింది. 1 నుంచి ఇంటర్‌ వరకు 1,14,415 మంది విద్యార్థులు ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి వివిధ సర్కారు పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. సర్కారులో సాధారణ పాఠశాలలతోపాటు విద్యాశాఖ పరిధిలోని మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వీరంతా ప్రవేశాలు పొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చదువుకుంటే రూ.2 వేల సాయం!

4. చెప్పమంటోంది.. నా మనసు

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పని చేసేవాణ్ని. గతేడాది లాక్‌డౌన్లో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇవన్నీ దాచిపెట్టి మావాళ్లు నాకో సంబంధం ఫిక్స్‌ చేశారు. ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పారు. నవంబరులో పెళ్లి. ఇది వాళ్లని మోసం చేయడమే కదా అంటే ఈలోపు ఏదో ఒక జాబ్‌ దొరుకుతుందిలే అంటున్నారు మావాళ్లు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రివ్యూ: భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

స్వాతంత్ర్యానికి ముందూ తర్వాత అఖండ భారతావని చరిత్రలో మరిచిపోలేని, నిత్య జీవనంలో స్ఫూర్తినింపే గాథలెన్నో ఉన్నాయి. తరచి చూస్తే, నేటి తరానికి, రాబోయే తరాలకు ఎప్పటికీ అవి విజయగాథలే. ఆ గాథలనే కథా వస్తువులుగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శక-నిర్మాతలు ఎందరో. ఆ కోవలోకి వచ్చేదే భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!

6. పఠాన్‌కోట్‌ దాడికి ఇంటిదొంగల సాయం

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించి తాజాగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతిపరులైన కొందరు స్థానిక పోలీసులు ఈ దాడికి సహకరించి ఉండొచ్చని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు ఆండ్రియాన్‌ లెవీ, క్యాథీ స్కాట్‌-క్లార్క్‌లు పేర్కొన్నారు. వీరు రాసిన ‘స్పై స్టోరీస్‌: ఇన్‌సైడ్‌ ద సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ద ఆర్‌ఏడబ్లూ (రా) అండ్‌ ఐఎస్‌ఐ’ పుస్తకంలో దీన్ని ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏమైంది ఆ ముగ్గురికి..

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో భారత్‌ స్కోరు 97/0. ప్రత్యర్థిని 183 పరుగులకే కట్టడి చేశాక.. భారత్‌కు దక్కిన ఆరంభమిది. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ ఆరంభ పోరులో భారత్‌కు ఇంతకంటే ఆరంభం ఏముంటుంది? కానీ ఇంకో రెండు గంటల ఆట గడిచేసరికి భారత్‌ స్కోరు 145/5. చేతుల్లోకి వచ్చేసినట్లుగా కనిపించిన మ్యాచ్‌పై ఉన్నట్లుండి భారత్‌ పట్టు కోల్పోవడానికి కారణం.. 3, 4, 5 స్థానాల్లోని పుజారా, కోహ్లి, రహానెల ఘోర వైఫల్యం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* KTR: టెస్ట్‌ క్రికెట్‌లోనే మజా: కేటీఆర్‌

8. పీజీ నీట్‌కు స్వస్తి!

పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్‌కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్‌ ఎగ్జిట్‌’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్‌ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది. ఎగ్జిట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రయత్నించవచ్చు లేదా వైద్యవృత్తిని కూడా ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఎగ్జిట్‌లో ఉత్తీర్ణులైతేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘గృహ’ణం వీడేనా!

సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు తిప్పాపూరు.. వేములవాడకు నాలుగేళ్ల కిందట 800 ఇళ్లు మంజూరైతే, 144 ఇళ్ల నిర్మాణం తిప్పాపూరులో చేపట్టారు. చవుడు నేల కావడంతో చిన్నపాటి వానకే నీళ్లు ఊరుతూ పైకి వస్తున్నాయి. దీంతో ఏడాదిన్నరగా ఇక్కడ పిల్లర్లు, శ్లాబుల దశలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మిగిలిన 656 ఇళ్లకు ఇంకా స్థలాల కోసం వెతుకుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అనుకూలతలే ఎక్కువ

10. మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి...

‘ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడు/స్నేహితురాలు కావాలా..?’ అంటూ వచ్చే ఈ ఒక్క ఎస్‌ఎంఎస్‌ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకునేలోపే వలపు వలకు చిక్కి.. బయటకు రాలేకపోతున్నారు. తమకు జరిగిన మోసం ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే మానసికంగా కుమిలిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని