Updated : 13/08/2021 09:30 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రాజధానిలో ఆడియో కలకలం

ఓ పోలీసు అధికారికి.. ప్రజాప్రతినిధి బంధువుగా భావిస్తున్న ఇంటి యజమానికి మధ్య జరిగిన సంభాషణ రాజధాని ప్రాంతంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ‘సర్‌ ఒక్క ట్రిప్పుతోనే అడ్డుకున్నారు.. ఇప్పుడు తోలుకోనా’ అని ఇంటి యజమాని అడగడం.. ‘ఇప్పుడొద్దు కాస్త లేట్‌గా 12-3 గంటల మధ్య చేసుకో’ అని అధికారిగా భావిస్తున్న వ్యక్తి చెప్పిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* WhatsApp: ‘వెలుగు’ గ్రూపులో నీలి వీడియో కలకలం

2. బాయ్‌ఫ్రెండ్‌ కోసం యువతుల బాహాబాహీ

ఓ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియో రూపంలో వైరల్‌ అయింది. వారికి సర్దిచెప్పేందుకు ఓ యువకుడు, మరో యువతి ప్రయత్నించారు. కింద పడిపోయినా సిగపట్లు వదలని వారిని అతి కష్టం మీద విడదీశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి యువతులిద్దరూ పరారయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికలపై ఏం చేద్దాం?

ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ మహమ్మారి తిష్ఠ వేసిన నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరింది. ఈ నెల 30వ తేదీలోపు సూచనలు పంపాలని గడువు విధించింది. 2021-22లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశంలో పలుచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని గుర్తు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రాజకీయాలు ప్చ్‌...కృత్రిమ మేధ మస్త్‌!

4. పేటీఎం ఐపీఓను నిలిపేయండి!

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) తొలి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ సక్సేనా (71) ఐపీఓను నిలిపివేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరారు. తాను పేటీఎం సహ వ్యవస్థాపకుడినని, రెండు దశాబ్దాల క్రితమే 27,500 డాలర్లు పెట్టుబడి పెట్టానని, అయితే తనకు ఇంత వరకు ఎలాంటి షేర్లు కేటాయించలేదని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనాతో తగ్గుతున్న ఆలోచనశక్తి!

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో కొందరికి ఆలోచన, ఏకాగ్రత సహా విషయ గ్రహణ నైపుణ్యాల్లో సమస్యలు తలెత్తవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 80వేల మందిపై పరిశోధన జరిపిన బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. వీరికి వరుసగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. వాలంటీర్లలో.. తీవ్రస్థాయి కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు వీటిలో చాలా తక్కువగా మార్కులు సంపాదించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 4 వారాల్లో అమెరికాలో పెరగనున్న కొవిడ్‌ తీవ్రత

6. Youtube: యూట్యూబ్‌ చూసి హెలికాప్టర్‌ తయారు చేశాడు.. కానీ..

కేవలం ఎనిమిదో తరగతి వరకే చదివిన యువకుడు సొంతంగా హెలికాప్టర్‌ తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే అదే హెలికాప్టర్‌ తన ప్రాణం తీస్తుందని ఊహించలేకపోయాడు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా మహాగావ్‌ తాలూకా ఫుల్సవంగికి చెందిన షేక్‌ ఇబ్రహీం(24) తన సోదరుడి గ్యాస్‌ వెల్డింగ్‌ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ, అందులో ప్రావీణ్యం సాధించాడు. గత రెండేళ్లుగా యూట్యూబ్‌ చూస్తూ, కావాల్సిన పరికరాలు సమకూర్చుకుంటూ ఓ హెలికాప్టర్‌ను తయారుచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Afghanistan: తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్‌ నగరం

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా కాందహార్‌ను తమ నియంత్రణలో పెట్టుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో రాజధాని కాబూల్‌ తర్వాత అతిపెద్ద నగరం కాందహార్‌. అఫ్గాన్‌లోని సగ భాగం ఇప్పటికే తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* క్షేమమా?.. చెప్పేస్తుంది!

8. Viveka Murder Case: రక్తపు మడుగులో పడి ఉంటే... సాధారణ మరణమని ఎలా అనుకున్నారు?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే మీరు సాధారణ మరణమని ఎలా అనుకున్నారని వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్‌, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్‌రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు ప్రశ్నించగా, కంగారులో సరిగా గుర్తించలేక పోయానని బదులిచ్చినట్లు సమాచారం. గురువారం సీబీఐ అధికారులు కడప, పులివెందులలో పలువురు అనుమానితులను విచారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అహో.. కేఎల్‌

చివర్లో.. చిట్ట చివర్లో.. కోహ్లి ఔట్‌ కాకుండా ఉంటేనా! అని అనుకోని భారత్‌ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. రాహుల్‌, రోహిత్‌ల అదిరే బ్యాటింగ్‌తో రోజంతా ఆటను ఆస్వాదించిన వారికి అది కాస్త నిరాశ కలిగించే విషయం. .. కానీ మరేం ఫర్వాలేదు. భారత్‌ ఆందోళన చెందాల్సిందేమీ లేదు. కెప్టెన్‌ నిష్క్రమించినా.. జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. వర్షం వల్ల మొదటి టెస్టులో గెలవలేకపోయిన టీమ్‌ఇండియా లార్డ్స్‌లో మరో చక్కని అవకాశం సృష్టించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పారాలింపిక్స్‌కు 54 మందితో

10. నాలెక్కనే నీపనైతది

‘‘హరీశ్‌.. నీ మోసపూరిత మాటల్ని హుజూరాబాద్‌ ప్రజలు నమ్మరు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నవ్‌.. మీ మామ కేసీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నవ్‌.. ఎప్పటికైనా నాలెక్కనే నీపని కూడా తెరాసలో ముగుస్తదని గుర్తుపెట్టుకో’’ అని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని