Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jun 2021 09:07 IST

1. ఇలా పెరుగుతుంటే.. ఇల్లు కట్టేదెలా?

కొవిడ్‌ తెచ్చిన ఆర్థిక ఇబ్బందులకు తోడు పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలతో చాలామందికి సొంతిల్లు తీరని కలే అవుతోంది. ప్రత్యేకించి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు గృహనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నాక.. భారమవుతున్న ధరలతో చివరి క్షణంలో విరమించుకుంటున్నారు. స్థలం ఉన్నవారు కూడా సిమెంట్‌, ఇనుము, ఇసుక, కంకర, కూలి రేట్ల వరకు భారీగా పెరగడంతో నిర్మాణానికి ముందుకు రావడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వీరందరి పయనమెటు..?

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఈసారి పరీక్ష ఫీజులు చెల్లించిన 4.73 లక్షల మందీ ఉత్తీర్ణులు కావడంతో వీరంతా ఈసారి ఏ కోర్సుల్లో చేరతారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఇంటర్‌ జనరల్‌ కోర్సులతో గత ఏడాది కంటే ఈసారి దాదాపు 33వేల మంది.. 2019తో పోల్చుకుంటే సుమారు 1.60 లక్షల మంది ఎక్కువగా ఉత్తీర్ణత పత్రాలతో బయటకు వస్తున్నారు. ఇక ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులు, ప్రైవేట్‌ విద్యార్థులు(గతంలో ఒకసారి తప్పినవారు) ఇంకా వేల మంది ఉండనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాఠశాలలు రుసుములు పెంచొద్దు

3. రూ.6.28 లక్షల కోట్లతో... మరో ఉద్దీపన

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం మరో ఉద్దీపనను ఆవిష్కరించింది. ఉత్పత్తిని, ఎగుమతుల్ని, ఉపాధి అవకాశాల్ని పెంచే రీతిలో ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.6,28,993 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. 15 విభాగాల్లో విభిన్న రకాల ఉపశమనాలు ప్రకటించారు. ఇందులో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని పాత పథకాల పొడిగింపులున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Covid: ‘బీటా’పై ప్రస్తుతటీకాల సమర్థత తక్కువే

కరోనా వైరస్‌లో కొత్తగా వెలుగుచూసిన బీటా రకంపై ప్రస్తుత టీకాలు సమర్థంగా పనిచేయకపోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. సదరు వేరియంట్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌పై పరిశోధన జరిపినప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఈ ప్రొటీన్‌ సాయంతోనే కరోనా.. మానవ కణంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత టీకాలన్నీ దీని లక్ష్యంగా తయారైనవే. అమెరికాలోని బోస్టన్‌ పిల్లల ఆసుపత్రికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. వీరు క్రిప్టో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కొపీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: డెల్టా ప్లస్‌పై కంగారొద్దు

5. వందశాతం జల విద్యుదుత్పత్తి

నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ‘విద్యుదుత్పత్తి సంస్థ’(జెన్‌కో)ను ఆదేశిస్తూ ఇంధన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నదుల నుంచి నీటిని ఎత్తిపోస్తే తప్ప రాష్ట్ర రైతుల ఆకాంక్షలు నెరవేరవని, ఎత్తిపోతలకు భారీగా విద్యుత్‌ అవసరమని ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ రాసిన లేఖతో ఇంధనశాఖ ఈ ఆదేశాలు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆయాసమా? సీవోపీడీ కావొచ్చు

క వయసు దాటాక పనులు చేస్తున్నప్పుడు ఆయాసం వస్తున్నా, విడకుండా దగ్గు వేధిస్తున్నా చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవే తగ్గిపోతాయిలే అనుకుంటుంటారు. లేదూ వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఇవి మామూలేనని భావిస్తుంటారు. నిజమే. వయసు మీద పడుతున్నకొద్దీ శక్తి తగ్గటం, పనులు కష్టమని అనిపించటం సహజమే. కానీ ఇవి దీర్ఘకాల ఊపిరితిత్తుల జబ్బు క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీవోపీడీ)కూ సంకేతాలు కావొచ్చు. ఇందులో ఊపిరితిత్తులు మనకు అవసరమైనంత గాలిని లోనికి తీసుకోలేవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Covid యాంటీబాడీలను పసిగట్టే కొత్త సాధనం

7. Nayanatara: అప్పుడు పెళ్లి చేసుకుంటాం!

నటి నయనతార త్వరలో పెళ్లి కబురు వినిపించనుందా? కొవిడ్‌ పరిస్థితులు కుదుట పడగానే పెళ్లి పీటలెక్కనుందా? అవుననే చెబుతున్నారు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. నయన్‌ - విఘ్నేశ్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తరచూ విహారం కోసం విదేశాలు చుట్టొస్తుంటారు. ఇప్పుడీ ప్రేమ జంట.. వివాహ బంధంతో ఒక్కటి కాబోతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన విఘ్నేశ్‌.. తమ పెళ్లి విషయపై స్పష్టత ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కన్నవారు కాదనుకుంటే.. పెంచినవారికి పేరు తెచ్చింది

పోషించే స్థోమత లేదని అమ్మానాన్నా అనాథాశ్రమంలో వదిలేశారు. వారాల వయసున్న పసికందును ఓ దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఆసక్తి చూపితే క్రికెట్‌ను నేర్పించారు. ఆ అమ్మాయి అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది. దానికి నాయకత్వం వహించడమే కాకుండా పెరిగిన దేశానికి ప్రపంచ కప్పునూ అందించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ లిసా కాప్రినీ స్తాలేకర్‌ కథే ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జోడీ.. గురి.. కుదిరింది

9. TS News: చదువు కోసమొచ్చి.. వ్యభిచారం వృత్తి..

గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం నేరెడ్‌మెట్‌లో డెకాయి ఆపరేషన్‌ నిర్వహించి టాంజానియాకు చెందిన డయానా(24), కాబాంగిలా వారెన్‌(24)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డయానా, వారెన్‌ స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. రెండు నెలల కిందట తార్నాకా నుంచి నేరెడ్‌మెట్‌కు మకాం మార్చారు. భార్యాభర్తలమని చెప్పి అక్కడ గది అద్దెకు తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. త్రీగోర్జెస్‌ను తలదన్నేలా..!

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యాం త్రీగోర్జెస్‌ను తలదన్నేలా మరో భారీ ఆనకట్టను, దానిపై పేద్ద జలవిద్యుత్‌ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దవాటిలో రెండోదిగా పేర్కొనే బైహెతాన్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆ దేశం సోమవారం పాక్షికంగా ఆరంభించింది. ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ రెండు యూనిట్లను ప్రారంభించారు! మొత్తం 16 యూనిట్లకుగాను మిగిలిన 14 యూనిట్లను 2022 జులై కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సాగర గర్భంలో ఖనిజాన్వేషణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని