Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Aug 2021 13:52 IST

1. Pegasus: కోర్టులో విచారిస్తుంటే.. సోషల్‌మీడియాలో చర్చలెందుకు?

న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సోషల్‌మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

SC: అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి

2. Dinesh Karthik: ధోనీ తుపాను సృష్టించాడు.. ఇక నాకు తలుపులు మూసుకుపోయాయి!

మహేంద్రసింగ్‌ ధోనీ తన రాకతో భారతదేశాన్ని ఊపు ఊపేశాడని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడి రాకతో తనకిక తలుపులు మూసుకుపోయాననే భావించానని తెలిపాడు. వికెట్‌ కీపర్‌గా అవకాశం లేకపోవడంతో స్పెషలిస్టు బ్యాటర్‌గా ప్రయత్నించాలని ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ తనను ప్రోత్సహించారని వెల్లడించాడు. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసుకు వ్యాఖ్యానం చేస్తున్నాడు. చాలాకాలం జట్టుకు దూరమైన డీకే 2019 ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మోకాలికి ఏమైనా అవుతుందేమోనని అమ్మ భయపడింది.. అందుకే నా కాంస్యం బంగారం!

3. Paagal Trailer: అలరిస్తోన్న ‘పాగల్‌’ ట్రైలర్‌

లవర్‌బాయ్‌గా విశ్వక్‌ సేన్‌ నటించిన చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘నా పేరు ప్రేమ్‌. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను’ అని విశ్వక్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ అలరిస్తూనే భావోద్వేగానికి గురిచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. China : ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్న గజరాజుల గుంపు

చైనాలోని రిజర్వు అటవీ ప్రాంతం నుంచి గతేడాది బయటకు వచ్చిన గజరాజుల గుంపు.. ఎట్టకేలకు తిరిగి తమ ఆవాసానికి చేరుకున్నాయి. 14 ఆసియా ఏనుగుల మంద నైరుతి చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌కు తిరిగి వచ్చాయి. కొన్ని నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణం చేసిన సంచార ఏనుగులు.. గత ఐదు రోజులుగా యుగ్జీ నగరం సమీపంలో తిరిగాయి. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను పర్యవేక్షించారు. ట్రక్కులు అడ్డుపెట్టి ఏనుగులు తమ ఆవాసానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Madhyapradesh: శివుడే మా సీఎం.. కరోనాతో భయమేంటి?

5. Neeraj Chopra: నీరజ్‌ పేరుంటే చాలు.. రూ.500 పెట్రోల్‌ ఫ్రీ

ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గుజరాత్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోల్‌ బంకులో నీరజ్‌ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల్‌ ఉచితంగా కొట్టాడు. అయితే పేరు నీరజ్‌ అని రుజువు చేసుకునేందుకు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని పెట్రోల్ బంకులో ఇవ్వాలని నిబంధన పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. CM Jagan: పాదయాత్రలో చేనేతల ఇబ్బందులు చూశా: సీఎం జగన్‌

చేనేతలు పడుతున్న ఇబ్బందులను పాదయాత్రలో చూశానని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందులున్నా చేనేతల కష్టాలు తీర్చేందుకే ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులై సొంత మగ్గం కలిగిన 80వేలకు పైగా చేనేత కార్మికులకు రూ.24వేలు చొప్పున రూ.192 కోట్ల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* YS Sharmila: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో షర్మిల పర్యటన

7. సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లలో పెట్టుబ‌డి పెట్టాలనుకుంటున్నారా?  

ఆర్ధిక సంవత్సరం 2021-22 కి గాను 5వ దశ సార్వభౌమ పసిడి బాండ్లు సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. ఇష్యూ ధ‌ర రూ. 4,790. ఆన్లైన్ ద్వారా పసిడి బాండ్లను కొనుగోలు చేసే వారికి మ‌రో రూ. 50 త‌గ్గింపు ల‌భిస్తుంది.  ఆగ‌ష్టు 9 నుంచి 13 వ‌ర‌కు ఈ పసిడి బాండ్ల కోసం మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆగ‌ష్టు 17, 2021న జారీ చేస్తారు. ప్రభుత్వం తరపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Murder: విజయవాడ యువతిని చంపేసి.. యమునా నదిలో తోసేశారు!

విజయవాడకు చెందిన యువతి అదృశ్యం కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి.. ఆ మాయగాడి మోసానికి బలైపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తస్లిమా ఫాతిమా అనే యువతి.. స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం ప్రియుడు తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లిపోయాడు. ప్రియుడు రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఫాతిమా విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: డిక్కీలో శవం.. కారును దగ్ధం చేసిన దుండగులు

9. HYD: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

 వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఈ నెల 7న సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి నోటీసు కూడా జారీ చేసింది. కాగా, ఇవాళ జరిగిన విచారణలో కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న సీబీఐ ధర్మాసనం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Bollywood: వామ్మో.. దీపికా పదుకొణె బాడీగార్డ్‌ జీతం ఇంతనా!

సినిమా, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు బయటకు అడుగుపెట్టారంటే చాలు.. వాళ్లని చూడాలని చుట్టూ అభిమానులు గుమిగూడుతుంటారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్‌ అంటూ ఎగబడుతుంటారు. ఇదంతా వాళ్ల అభిమానానికి నిదర్శనం. అయితే కొన్ని సమయాల్లో ఆ అభిమానం శ్రుతి మించుతుంటుంది. ఇలాంటి వారి నుంచి ప్రముఖులకు రక్షణ కావాలంటే కచ్చితంగా వారికంటూ బౌన్సర్స్‌, బాడీగార్డ్స్‌ తప్పనిసరి! మరి బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ రక్షణ కోసం నియమించుకున్న బాడీగార్డ్స్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: 30 వేల లోపు కేసులు.. 400 దిగువకు మరణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని