Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jul 2021 13:31 IST

1. BS Yadiyurappa: సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా 

కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాటకీయతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్‌ యడియూరప్ప తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం యడ్డీ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన రోజే యడియూరప్ప రాజీనామా చేస్తుండటం గమనార్హం. సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్‌కు కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Olympics: ఒలింపిక్స్‌..  ఆర్థికంగా లాభమా? నష్టమా?

ఈ భూమిపై జరిగే అతిపెద్ద పోటీల్లో ఒలింపిక్స్ ఒకటి. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ క్రీడా కుంభమేళా నిర్వహణకు అనేక నగరాలు పోటీ పడుతుంటాయి. దాదాపు ఒక దశాబ్దం ముందే వేదికలు ఖరారైపోతాయి. మరి ఇంతటి భారీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు ఎవరు భరిస్తారు? ఒలింపిక్స్‌ నిర్వహణ ఆర్థికంగా లాభమా? నష్టమా? తొలినాళ్లలో ఒలింపిక్స్‌ నిర్వహణకు పెద్ద ఖర్చేమీ అయ్యేది కాదు. ఆటల నిర్వహణకు తగిన వసతులు ఉన్న ధనిక దేశాలే ఒలింపిక్స్‌కు వేదికలుగా ఉండేవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tokyo Olympics: భవానీ దేవీ.. నీ పేరు గుర్తుండిపోతుంది!

3. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత 

లష్కర్‌ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితులతో గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పగా.. స్వర్ణలత దానికి సమాధానమిచ్చారు. ‘‘మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Demchok: భారత భూభాగంలో చైనా గుడారాలు..!

ఓ పక్క కోర్‌ కమాండర్ల స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నా చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తాజాగా దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్లు సమాచారం. దీంతో భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా.. తాము చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. దీంతో సైన్యం వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Checkmate: ధర చౌక.. జెట్‌ కేక!.. పెద్దసంఖ్యలో అమ్మేందుకు కసరత్తు

5. RS Praveen Kumar: ‘నన్ను వివాదాల జోలికి లాగొద్దు’

హుజూరాబాద్‌లో నేతలకు మద్దతిస్తున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తాను మద్దతిస్తున్నట్లు జరుగుతన్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘‘నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజూరాబాద్‌లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలి. ఇప్పటికే వీఆర్‌ఎస్‌ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నాను. నన్ను వివాదాల జోలికి లాగొద్దని కోరుతున్నా. వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయి’’ అని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Delta Variant: కొరుకుడుపడని డెల్టా!

కరోనాలో వెలుగు చూసిన వేరియంట్లన్నింటిలోకి అత్యంత ఎక్కువ సాంక్రమిక శక్తిని ప్రదర్శిస్తున్న డెల్టా రకాన్ని కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్‌ బారినపడినవారికి దగ్గరగా వెళ్లిన వారిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వ్యవధి తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 టీకాలు ప్రజలందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో ఈ రకం ఉద్ధృతికి కళ్లెం వేయాలంటే ఇలాంటివారిని శరవేగంగా గుర్తించడం ముఖ్యమని స్పష్టంచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: 400కు దిగొచ్చిన మరణాలు

7. Parliament Mansoon Session: పార్లమెంట్‌లో అదే రగడ.. మళ్లీ వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సోమవారం కూడా అదే గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు విపక్షలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వారి నినాదాల నడుమే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. CBI Court: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజు, జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Viveka murder case: వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ

9. RIP Jayanthi: ప్రముఖ నటి జయంతి కన్నుమూత

‘ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. CM KCR: దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్‌

దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఈ కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎస్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. దళితబంధు లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దీన్ని విజయవంతం చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: ఓ కారుపైకి దూసుకెళ్లిన మరో కారు.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని