భలే స్టార్టప్‌: పెరట్లో ఇళ్లు కట్టి అద్దెకిస్తారట!

పెద్ద పెద్ద పట్టణాల్లో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం మహా కష్టం. ఎక్కడ చూసినా అద్దెలు వేలల్లో ఉంటాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లోనూ ఉండేదే. అమెరికాలోని....

Updated : 09 Dec 2020 09:43 IST


(ఫొటో: ఓబీవై హోమ్స్‌ వెబ్‌సైట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పెద్ద పట్టణాల్లో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎక్కడ చూసినా అద్దెలు వేలల్లో ఉంటాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉండేదే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనూ ఈ సమస్య మరీ ఎక్కువ. దీంతో ఈ విషయంలో పేదలకు మంచి చేయాలనే సంకల్పంతో ‘అవర్‌ బ్యాక్‌యార్డ్‌ (ఓబీవై)’ అనే స్టార్టప్‌ సంస్థ చక్కటి ఆలోచనతో ముందుకొచ్చింది. అక్కడి పేదలకు అద్దెకు ఇవ్వడం కోసం తక్కువ స్థలంలో మంచి ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఈస్ట్‌ బే ప్రాంతంలో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం కష్టమైపోతోంది. ఇదివరకే నిర్మించి ఉన్న ఇళ్లు పెద్దవిగా.. ఇంటి వెనుక ఎక్కువ స్థలం ఉంటోంది. ఇలాంటి ఇళ్లకు అద్దె భారీగానే ఉంటోంది. దీంతో ఓబీవై అనే స్టార్టప్‌ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలోని ఇళ్ల వెనుక ఉండే పెరడును ఈ సంస్థ 99 ఏళ్లు లీజుకు తీసుకొని.. అందులో కలపతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు 500 డాలర్ల వరకు ఆదాయం పొందుతున్న వారికి మార్కెట్‌ ధర కంటే తక్కువ రేటుకే ఇంటిని అద్దెకిస్తామని ఆ సంస్థ చెబుతోంది. రెండు పడకల గదులతో పాటు వంటగది, బాత్‌రూమ్‌, లాండ్రీ, లివింగ్‌ రూమ్‌ అన్ని సదుపాయాలూ ఉండేలా చూస్తున్నారు. ఇంటి రూఫ్‌టాప్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తుండటంతో విద్యుత్‌ బిల్లుల మోతా తప్పుతుంది. పేదలకు తక్కువ అద్దెలో ఇళ్లు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ‘ఓబీవై’ సంస్థ చేసిన ఆలోచన నిజంగా సూపర్‌ కదా!

ఇవీ చదవండి..

ప్రశాంత జీవితానికి పంచ సూత్రాలు!

బరువు పెరగాలనుకుంటున్నారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని