AP News:  కృష్ణమ్మ అందాలు.. భవానీ ద్వీపం చూసొద్దామా! 

కృష్ణమ్మ తీరంలో పర్యాటకం ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజీ, కృష్ణమ్మ అలలు, భవానీ ద్వీపం అందాలు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

Published : 29 Nov 2021 01:03 IST

విజయవాడ: కృష్ణమ్మ తీరంలో పర్యాటకం ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజీ, కృష్ణమ్మ అలలు, భవానీ ద్వీపం అందాలు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. విహార యాత్రలతో కృష్ణానదీ తీరం మళ్లీ సందర్శకులతో కళకళలాడుతోంది. కొవిడ్‌ అనంతరం రెండేళ్ల తర్వాత భవానీ ద్వీపం తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజీతో పాటు భవానీ ద్వీపం చూసేందుకు పర్యాటక ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 15 రోజుల క్రితం ప్రారంభమైన కృష్ణానదిలో బోటింగ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువత కేరింతలు కొడుతూ స్పీడ్‌ బోటింగ్‌ చేస్తున్నారు. కొవిడ్‌తో ఇంట్లోనే ఉండటం, విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులతో కుంగిపోయారని.. ఇలా ప్రకృతి ఒడిలో హాయిగా గడపటం మధురానుభూతులను కలుగచేస్తుందని సందర్శకులు చెబుతున్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే పర్యాటకులను అనుమతిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే లైఫ్‌ జాకెట్లను ప్రతి పర్యాటకుడు ధరించేలా చూస్తున్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. పరిమితికి మించి ఎవరినీ పడవలోకి అనుమతించటంలేదు. పర్యాటకులు సైతం ఏపీ టూరిజం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని