TS News: తెలంగాణలో 13మంది శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు..!

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 39,140 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 198మందికి కరోనా పాజిటివ్‌గా

Published : 04 Dec 2021 01:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 39,140 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 198మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, ఒమిక్రాన్‌ భయాందోళనల నేపథ్యంలో ‘ఎట్‌ రిస్క్’ దేశాల నుంచి ఇప్పటి వరకు 909మంది మంది తెలంగాణకు వచ్చినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఒక్కరోజే 219 మంది హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా.. వారిలో 9మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిలో మొత్తం 13మందిలో కొవిడ్‌-19 ఉన్నట్టు తేలగా.. వారిందరి శాంపిల్స్‌ని జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా బారిన పడినవారిలో తాజాగా మరో 153 మంది కోలుకోగా.. ఇద్దరు మృతిచెందారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.86 కోట్లకు పైగా శాంపిల్స్‌ని పరీక్షించగా.. 6,76,574మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,68,854 మంది కోలుకోగా.. 3,997 మంది కొవిడ్‌ కాటుకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3723 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని