AP News: కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు

విద్యారంగ సమస్యల పరిష్కారం ఏపీ వ్యాప్తంగా విద్యార్థుల కదంతొక్కారు.

Updated : 08 Oct 2021 14:51 IST

అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో విద్యార్థుల కదంతొక్కారు. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్‌ కళాశాలల ప్రైవేటీకరణ, ఉపకార వేతనాల మంజూరు సమస్యలపై నిరసనలు చేపట్టారు. నిరసన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బారికేడ్లు తోసుకుని కొందరు కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు పక్కకు  లాగి పడేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. జిల్లా కలెక్టర్‌ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని