GHMC : అందరికీ టీకాలే లక్ష్యంగా.. ప్రారంభమైన స్పెషన్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది.

Updated : 23 Aug 2021 12:03 IST

హైదరాబాద్‌ : గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ బోర్డులు ఉమ్మడిగా ఈ ప్రక్రియను చేపట్టాయి. విస్తృతంగా జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ అందజేయనున్నారు.

ఇందుకోసం సంచార వ్యాక్సిన్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. మొబైల్ వాహనాలతో వీధుల్లో తిరుగుతూ జీహెచ్‌ఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 4846 కాలనీలు, బస్తీలతో పాటు కంటోన్మెంట్‌లోని 360 బస్తీలు, కాలనీల్లో డ్రైవ్‌ కొనసాగుతోంది.

గ్రేటర్‌లో ఇప్పటికే 70 శాతానికి పైగా అర్హులైన 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తియిందని అధికారులు తెలిపారు. ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోని వారిని ఏ ఒక్కరినీ వదలకుండా వంద శాతం వ్యాక్సిన్‌ ఇప్పించేందుకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 175 ప్రత్యేక సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్‌ పరిధిలో మరో 25 వాహనాలను సిద్ధం చేశారు. సుమారు 15 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని