AP News: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

పోవలరం ప్రాజెక్టుకు సంబంధించి ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి

Updated : 02 Dec 2021 19:18 IST

దిల్లీ: జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పోలవరంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టుతో పాటు పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో 3 ప్రాజెక్టులకు కూడా జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని రాష్ట్రానికి ఎన్జీటీ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై  ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని