AP News: ఒంగోలులో ‘నరకాసుర వధ’.. భారీగా హాజరైన ప్రజలు

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయో బేధం లేకుండా అందరూ

Updated : 04 Nov 2021 13:38 IST

ఒంగోలు: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయో బేధం లేకుండా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా పలుచోట్ల ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉన్న చెన్నకేశవ ఆలయం వద్ద బుధవారం రాత్రి నుంచి వేడుకలు జరిగాయి. గురువారం తెల్లవారుజామున చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని