KTR: 11నుంచి తెలంగాణలో ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’.. ట్విటర్‌లో కేటీఆర్‌

తెలంగాణలో డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు పంపిణీ చేసే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈనెల 11వ తేదీన ప్రపంచ ఆర్థిక వేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వికారాబాద్‌లో

Updated : 09 Sep 2021 02:33 IST

హైదరాబాద్: తెలంగాణలో డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు పంపిణీ చేసే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈనెల 11వ తేదీన ప్రపంచ ఆర్థిక వేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వికారాబాద్‌లో ‘‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు స్కై ఎయిర్ మొబిలిటీ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ అంకురాలు సంయుక్తంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మందులు, కొవిడ్ టీకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే డ్రోన్ టెక్నాలజీతో కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర లిఖిస్తుందన్నారు. విజువల్ లైన్‌కు ఆవల 500 నుంచి 700 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్ల ద్వారా మందుల సరఫరా జరగనుండగా.. దీన్ని మన కంటి దృష్టితో పరిశీలించేందుకు అవకాశం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని