HYD: బైక్‌తో పాటు మ్యాన్‌హోల్‌లో కొద్దిదూరం కొట్టుకుపోయా..

‘‘ఆటో నగర్‌ నుంచి కర్మాన్‌ఘాట్‌కు వెళ్తుండగా నాలాలో పడిపోయా. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బ్రేక్‌ కొట్టాను.

Updated : 13 Sep 2023 16:26 IST

నాలాలో పడి సురక్షితంగా బయటపడిన జగదీశ్‌

హైదరాబాద్‌: ‘‘ఆటో నగర్‌ నుంచి కర్మాన్‌ఘాట్‌కు వెళ్తుండగా నాలాలో పడిపోయా. నీళ్లు ఎక్కువగా ఉండటంతో బ్రేక్‌ కొట్టాను. రహదారి ఎడ్జ్‌లో బైకు స్కిడ్‌ అయింది. బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో కొద్దిదూరం కొట్టుకుపోయాను. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చేతికి తాడు లాంటి తగలడంతో పట్టుకొని బయటకు వచ్చా. చేతికి, వీపు భాగంలో గాయాలయ్యాయి’’ అని నిన్న రాత్రి చింతల్‌కుంటలో నాలాలో పడి సురక్షితంగా బయటపడిన జగదీశ్‌ మాటలివి.

అసలేం జరిగిందంటే..

బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి భారీ వర్షానికి రోడ్డుపై ఉన్న కల్వర్టు నాలాలో పడి సురక్షితంగా బయటపడిన ఘటన నిన్న వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది. అతను గల్లంతైనట్లు కొన్ని గంటలపాటు ఉత్కంఠ నెలకొన్నా.. చివరకు సుఖాంతమైంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్‌ వరద నీరు చేరింది. చింతల్‌కుంటలోని సురభి హోటల్‌ సమీపంలో కల్వర్టు నాలా ఉంది. అక్కడ భారీగా వరద ఉండగా.. బైక్‌పై వచ్చిన సరూర్‌నగర్‌ పరిధిలో తపోవన్‌కాలనీకి చెందిన జగదీష్‌ ద్విచక్రవాహనంతో సహా నాలాలో పడిపోయాడు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించి బైక్‌ను పట్టుకున్నారు. అతను జారి నాలాలో పడ్డాడు. గల్లంతయ్యారని భావించారు. ఏసీపీ పురుషోత్తంరెడ్డి, కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, పోలీసులు, జీహెచ్‌ఎంసీ బృందం చేరుకుని గాలింపు చేపట్టారు. 2 గంటలు తర్వాత అతను ప్రత్యక్షమవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని