Ts News: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో చదువుతున్న ఐదురుగు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారిలో ముగ్గురు

Updated : 24 Nov 2021 20:07 IST

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో చదువుతున్న ఐదురుగు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. చింతకాని జడ్పీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో గమనించిన పాఠశాల సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం విద్యార్థిని చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో తక్షణమే వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు, పాఠశాల అటెండర్‌కు పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని మండల వైద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. కొవిడ్‌ బారినపడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల వైద్యాధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని