CM Jagan: తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వండి: ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం  జగన్‌ కోరారు. ..

Updated : 24 Nov 2021 14:25 IST

అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం  జగన్‌ కోరారు.  ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే రూ.వెయ్యికోట్ల సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. 

‘‘రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. 196 మండలాల్లో నష్టం జరిగింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడటంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి’’ అని లేఖల్లో సీఎం జగన్‌ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు