CM Jagan: నేనున్నాను.. ధైర్యంగా ఉండండి: వరద బాధితులతో జగన్‌

ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట

Updated : 02 Dec 2021 16:21 IST

కడప: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో బాధితులతో సీఎం మాట్లాడారు. గ్రామంలో తిరుగుతూ వారిని పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులు సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జగన్‌ను వేడుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ‘నేనున్నాను.. ధైర్యంగా ఉండండి’ అని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన రూ.90వేల సాయం సరిపోదని.. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరారు. ఇళ్లు నిర్మించే బాధ్యత నాది.. అన్ని విధాలుగా ఆదుకుంటానని జగన్‌ వారికి చెప్పారు. అనంతరం గ్రామంలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని