AP News: కోవూరు వద్ద వరదనీటిలో చిక్కుకున్న సినీ  బృందం

నెల్లూరు జిల్లా కోవూరు  వద్ద షూటింగ్ కు  వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది.  నటుడు నవీన్‌ కుమార్‌ ..  వరదల్లో  చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ  వీడియో సందేశం విడుదల చేశారు.

Published : 21 Nov 2021 01:22 IST

కొవ్వూరు: నెల్లూరు జిల్లా కోవూరు  వద్ద షూటింగ్ కు  వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది.  నటుడు నవీన్‌ కుమార్‌ ..  వరదల్లో  చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ  వీడియో సందేశం విడుదల చేశారు. ‘3 నెలల  షూటింగ్ నిమిత్తం  కోవూరు వచ్చాం. కోవూరు  బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో  నాతో పాటు  30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది.  కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి ’ అని విజ్ఞప్తి చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు