Ts News: మనిషి అత్యంత తెలివైన, ప్రమాదకరమైన జీవి: త్రిదండి చిన్నజీయర్‌ స్వామి

అల్లోపతితో పాటు ప్రజలకు మంచి చేసే ఆయుర్వేదం, యునాని, నేచురోపతి వంటి వైద్యాలను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ..

Published : 28 Nov 2021 16:30 IST

హైదరాబాద్‌: అల్లోపతితో పాటు ప్రజలకు మంచి చేసే ఆయుర్వేదం, యునాని, నేచురోపతి వంటి వైద్యాలను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో యశోదా ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బ్రాంకస్-2021’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో యశోదా ఆస్పత్రి ఎండీ డా. జీఎస్ రావు, డైరెక్టర్ డా. పవన్ గోరుకంటి, సీనియర్ ఇంటర్వేన్షల్ పల్మనాలజిస్ట్ డా. హరికృషన్ సహా పలువురు వైద్యులు హాజరయ్యారు. శ్వాసకోశ వ్యాధులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా వైద్యులు పాల్గొన్నటం విశేషం.

చిన్నజీయర్‌ స్వామి మాట్లాడుతూ..‘‘మనిషి అత్యంత తెలివైన, ప్రమాదకరమైన జీవి.  కరోనా పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వైద్యానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇన్‌ఫెక్షన్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. కృత్రిమ వస్తువులు, కాలుష్యం కారణంగా ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాణాలు కాపాడేందుకు కొత్త సంకేతిక పరికరాలను సృష్టిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోకుండా వైద్య పరంగా మందులు ఇస్తూ పోవడం సరైంది కాదు. ఒక కొత్త మందు పని చేస్తున్నప్పుడు అది ఇస్తున్న వ్యక్తుల విద్యను, విధానాన్ని బట్టి దానిని నిలిపివేయడం సరికాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదం, నేచురోపతి వంటి పద్ధతులను అల్లోపతి కోసం పక్కన పెట్టడం మంచిది కాదు. ప్రతి వైద్య విధానానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని