HYD: వేలంపాటలో రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే.?
వేలంపాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఈ ఉదయం జరిగిన వేలంపాటలో
హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలసి నాదర్గుల్ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూరు దక్కించుకున్నారు.
వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం, డప్పు చప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు.
జగన్‌కు కానుకగా ఇవ్వాలనే.. : రమేశ్ యాదవ్
‘‘తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నా. శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నా. సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నా’’ అని ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్‌పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్‌పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్‌లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్‌లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు