పట్టాలెక్కనున్న 82 ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే

కరోనా పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో నిలిచిపోయిన ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ద.మ.రైల్వే జీఎం గజానన్‌ మాల్యా..

Published : 16 Jul 2021 21:38 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో నిలిచిపోయిన ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ద.మ.రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ప్రకటించారు. 16 ఎక్స్‌ప్రెస్‌, 66 ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి కొత్త నంబర్లతో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయన్నారు. ప్యాసింజర్‌ రైళ్లలో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇస్తారని పేర్కొన్నారు. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. రైళ్లలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని