TS News: మంజీరా నదిలో చిక్కుకున్న 11మంది గొర్రెల కాపరులు

కామారెడ్డి జిల్లా పరిధిలోని మంజీరా నదిలో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన 11 మంది భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ...

Updated : 08 Sep 2021 19:10 IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిధిలోని మంజీరా నదిలో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన 11 మంది భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ఉద్ధృతికి అక్కడే ఉండిపోయారు. పెద్దటాక్లీ, చిన్నటాక్లీకి చెందిన ఈ కాపరులు సిర్పూర్‌- పోతంగల్‌ మధ్య మంజీరాలో చిక్కుకున్నారు. ఫోన్‌ ద్వారా గ్రామస్థులకు వారు ఈ సమాచారం అందించారు. రాత్రి నుంచి వీరు మంజీరా నది ఒసుక ఒడ్డునే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులెవరూ తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని