Ts News: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం: కేసీఆర్‌

కృష్ణా జలాల అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందే వ్యూహంపై చర్చ జరిగింది. స్వయం పాలనలో

Updated : 06 Jul 2021 23:03 IST

హైదరాబాద్‌: కృష్ణా జలాల అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందే వ్యూహంపై చర్చ జరిగింది. స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వకూడదని తీర్మానించారు. జల వివాదం నేపథ్యంలో వ్యూహం, ఎత్తుగడలపై అధికారులకు సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని వేదికలపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఏపీ వైఖరి ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర నీటి వాటా రాబట్టుకోవాలని, లిఫ్టుల కోసం జలవిద్యుదుత్పత్తి కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ట్రైబ్యునల్స్‌, కోర్టులు, పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని నిర్ణయించారు. రాష్ట్ర నీటి వాటాపై పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని