కరుణానిధి జ్ఞాపకార్థం వస్తున్న కొత్త ప్రాజెక్టులు

కరుణానిధి జ్ఞాపకార్థం వస్తున్న కొత్త ప్రాజెక్టులు

Published : 05 Jun 2021 01:23 IST

* కరుణానిధి 97వ పుట్టినరోజు నాడు ప్రకటించిన తమిళప్రభుత్వం

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం.కరుణానిధి 97వ జన్మదిన కార్యక్రమాలను గురువారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మెరీనా బీచ్‌లో కరుణానిధి స్మారకచిహ్నం వద్ద  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రులు, పార్టీనేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కరుణానిధి జ్ఞాపకార్థంగా పలు కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రకటించిది. అవేంటంటే...
* దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు నగరాల్లోని ప్రభుత్వ ఆధర్వంలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణం. 
* రూ.250 కోట్లతో దక్షిణ చెన్నైలో కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
* పంటను నిల్వ చేసుకునేందుకు తంజావురు జిల్లాలో రూ.30కోట్ల విలువైన వేర్‌హౌస్‌ ఏర్పాటు.

* సాహిత్య అవార్డులతో పాటు పలు రాష్ర్ట అవార్డులు పొందిన రచయితలకు ప్రోత్సాహకాలు, తమిళ సాహిత్యానికి కృషి చేస్తున్న రచయితలకు మద్దతుగా రాష్ట్ర అవార్డులతో పాటు ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు. 

ఇదిలా ఉండగా తమిళనాడులో కొవిడ్‌ కట్టడి నిమిత్తం విధించిన లాక్‌డౌన్‌  జూన్‌7 వరకు కొనసాగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు