Lockdown: చిత్తూరు జిల్లాలో మరింత కఠినం 

చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి...

Updated : 29 May 2021 13:19 IST

తిరుపతి: చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సరకుల కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. జూన్‌ 1 నుంచి జిల్లాలో ఉదయం 10గంటల తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 2291 కొత్త కేసులు, 15 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ జిల్లాలో 1.85లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకోగా.. 1254మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,810 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని