HYD: ఎస్‌బీఐ ఏటీఎంలో వింత సమస్య

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో వింత సమస్య తలెత్తింది

Updated : 04 Jul 2021 10:34 IST

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో వింత సమస్య తలెత్తింది. రాంనగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎంలో కస్టమర్లు నగదు విత్‌డ్రా చేస్తే వారి ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయి. ఈ విధంగా రూ.3.40 లక్షలు విత్‌డ్రా జరిగింది. సాఫ్ట్‌వేర్‌ లోపంతో సాంకేతిక ఆధారాలు లభించలేదు. ఒకే ఏటీఎం నుంచి నగదు డెబిట్‌ కావడంతో సైబర్‌ కేటుగాళ్లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బ్యాంక్‌ మేనేజర్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని