సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..! ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ - విశాఖపట్నం.......

Updated : 08 Jan 2021 20:40 IST

సికింద్రాబాద్‌: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..! ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ - విశాఖపట్నం- హైదరాబాద్‌; సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య పలు రైలు సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. 07451 నంబర్‌ గల రైలు ఈ నెల 9నుంచి (రేపటి నుంచి) 16 వరకు ప్రతిరోజూ నడపనున్నట్టు తెలిపింది. ఈ రైలు హైదరాబాద్‌లో రాత్రి 10.15గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు విశాఖ చేరుకోనుంది.

అలాగే, విశాఖ - హైదరాబాద్‌ (07452) రైలును ఈ నెల 10 నుంచి 17 వరకు ప్రతిరోజూ నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు (07452) విశాఖపట్నంలో ప్రతి రోజూ రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొంది. 

ఆగే స్టేషన్లు ఇవే..

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం పట్టణం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ IIటైర్‌, ఏసీ IIIటైర్‌, స్లీపర్‌ తరగతులతో పాటు సెకెండ్ సీటింగ్‌ కోచ్‌లు కూడా ఉన్నాయని పేర్కొంది. అయితే, అన్నింటికీ రిజర్వేషన్‌ తప్పనిసరని స్పష్టం చేసింది. 

మరోవైపు, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి (07453)కి కూడా ఒక్కరోజు ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు తెలిపింది. జనవరి 12న రాత్రి 7.40 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఖాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది.

ఇదీ చదవండి..

‘రద్దు’కే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని