ఏపీఎస్‌ ఆర్టీసీ వీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌

మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 29 Feb 2024 16:59 IST

అమరావతి: మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ , స్టోర్స్‌ విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఠాకూర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిని ఆర్పీ ఠాకూర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ర్టీసీ వీసీఎండీగా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 
 

ఇవీ చదవండి..
అదే నా తప్పయితే క్షమించండి: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో ‘భోగి’ సందడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని