శునకాలకు ఉందో ఉద్యానవనం

రోజంతా పనుల్లో నిమగ్నమై కుటుంబంతో కాసేపు ప్రకృతిలో సేదతీరుతే ఆ హాయే వేరు. మరి ఇళ్లల్లో ఇష్టంగా పెంచుకునే కుక్కల పరిస్థితి ఏంటి? వాటి ఆనందం కోసమూ ఓ పార్కు ఉండాల్సిందేనంటున్నారు వరంగల్‌ నగరపాలక అధికారులు....

Published : 30 Mar 2021 01:09 IST

హన్మకొండలో పూర్తికావచ్చిన ‘పెట్‌ పార్క్‌’ పనులు

వరంగల్‌: పచ్చదనంతో ఉండే పార్కుకు వెళితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. రోజంతా పనుల్లో నిమగ్నమై కుటుంబంతో కాసేపు ప్రకృతిలో సేదతీరుతే ఆ సంతోషమే వేరు. మరి ఇళ్లల్లో ఇష్టంగా పెంచుకునే కుక్కల పరిస్థితి ఏంటి? వాటి ఆనందం కోసమూ ఓ పార్కు ఉండాల్సిందేనంటున్నారు వరంగల్‌ నగరపాలక అధికారులు. శునకాల కోసమే హన్మకొండలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఓ పార్కు ఆకట్టుకుంటోంది.

నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు, అద్దె ఇళ్లలో ఉండేవారికి వీటిని బయట తిప్పడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటివారి ఇక్కట్లు తీర్చేందుకే హన్మకొండలో కార్పొరేషన్‌ అధికారులు ‘పెట్‌ పార్క్‌’ను నిర్మిస్తున్నారు. రూ.48 లక్షల వ్యయంతో సకల హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్‌ ఆకట్టుకుంటోంది. పార్కులో కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటుచేశారు. ఆడుకునేందుకు అన్ని సౌకర్యాలతో అందంగా నిర్మించారు. కుక్కలకు దాహం వేస్తే తాగేందుకు నీటి కొలను నిర్మించారు. హైదరాబాద్‌ తర్వాత శునకాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పార్క్‌ ఇదే కావడంతో విశేషం. పెట్‌ పార్క్ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని