Doctors Day: వైద్యమే కాదు.. వైవిధ్యం కూడా చూపారు!

ఏ జీవికైనా ప్రాణం పోసేది అమ్మ. అదే జీవి అనారోగ్యం పాలైతే ఔషధాన్ని ఇచ్చి పునర్జన్మను ప్రసాదించేది వైద్యుడు.

Updated : 08 Dec 2022 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ జీవికైనా ప్రాణం పోసేది అమ్మ. అదే జీవి అనారోగ్యం పాలైతే ఔషధాన్ని ఇచ్చి పునర్జన్మను ప్రసాదించేది వైద్యుడు. కరోనా కష్ట కాలంలో లక్షల మంది వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఎంతో మంది బాధితుల ప్రాణాలు కాపాడారు. ఇప్పటికే ఎంతో మంది వైద్యులు కరోనాపై అలుపెరగని పోరాటం చేశారు.. చేస్తున్నారు.. వైద్యుడు అంటే కేవలం రోగికి మందు ఇవ్వడమే కాదు.. తను చెప్పే ప్రతి మాట ఔషధానికి మించి మనో ధైర్యాన్ని ఇవ్వాలి. ‘రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం’ అనే డైలాగ్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. కరోనా కష్టకాలంలో తమ కష్టాలను సైతం పక్కన పెట్టి ఎంతో మంది వైద్యులు కొవిడ్‌ బారిన పడిన వారిలో మనో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. కొవిడ్‌ వార్డుల్లో పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలన్నీ వైరల్‌ అయ్యాయి.‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా  ఆ వైరల్‌ వీడియోలను మరోసారి మీరూ చూసేయండి.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని