Ap News: మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ఏపీకి నాబార్డు రుణం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 3 బోధనాస్పతుల నిర్మాణానికి నాబార్డు రుణం మంజూరు చేసినట్టు ఆ సంస్థ సీజీఎం జన్నావర్ వెల్లడించారు

Published : 22 Jan 2022 15:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 3 బోధనాస్పతుల నిర్మాణానికి నాబార్డు రుణం మంజూరు చేసినట్టు ఆ సంస్థ సీజీఎం జన్నావర్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మొత్తంగా రూ. 1,392 కోట్లు రుణం మంజూరు చేసినట్టు తెలిపారు. నాబార్డు రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. ఏపీలో వైద్యపరమైన సౌకర్యాలు మెరుగుపర్చటంతో పాటు గిరిజన ప్రాంతాల్లో సకాలంలో వైద్య సేవలందించేందుకు వీలుగా ఈ రుణాన్ని వ్యయం చేయనున్నట్టు వివరించారు.

బోధనాస్పత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, ప్రత్యేకంగా క్లినికల్ కమ్ సర్జికల్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్‌ల సదుపాయం ఉటుందని వివరించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కన్సల్టేషన్ రూమ్, ఆయుష్ క్లినిక్, ట్రీట్‌మెంట్‌ ప్రొసీజర్ రూమ్, డయాలసిస్ వార్డు, డయాగ్నొస్టిక్ ల్యాబ్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపడతారని వెల్లడించారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కోసం రూ.3,092 కోట్లను నాబార్డు రుణంగా ఇచ్చినట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని