తోపుడు బండిపై తల్లి అంతిమయాత్ర

మాతృదినోత్సవం రోజునే ఓ తల్లికి అవమానం. అంతిమ సంస్కారాలకు అధికారులు నిరాకరించడంతో నిస్సహాయ స్థితిలో కుమారులు తల్లి మృతదేహాన్ని  తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఝహల్వార్‌లో చోటుచేసుకుంది....

Published : 10 May 2021 11:14 IST

జైపుర్‌: మాతృదినోత్సవం రోజునే ఓ తల్లికి అవమానం. అంతిమ సంస్కారాలకు అధికారులు నిరాకరించడంతో నిస్సహాయ స్థితిలో కుమారులు తల్లి మృతదేహాన్ని  తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఝహల్వార్‌లో చోటుచేసుకుంది.

ఓ మహిళకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకగా.. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందారు. అయితే ఆమెకు కనీసం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అక్కడి అధికారులు తిరస్కరించారు. ఆమె కుమారులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు. కనీసం మృతదేహాన్ని శ్మశానం వద్దకు తరలించేందుకు అంబులెన్సును కూడా అనుమతించలేదు. గ్రామస్థులు కూడా కుటుంబీకులకు సహకరించలేదు. ఇక చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో ఇద్దరు కుమారులు తమ తల్లి మృతదేహాన్ని తోపుడు బండిపై ఉంచి అంతిమయాత్ర చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్లు ఉన్న శ్మశానవాటికకు తోపుడుబండిపైనే తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని