TS News:  24 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

ఈ నెల 24 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంక్షేమ.....

Published : 23 Oct 2021 01:14 IST

హైదరాబాద్‌: ఈ నెల 24 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంక్షేమ భవన్‌లో పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. పూర్తిస్థాయిలో వాటా ధనం చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిట్‌ ధర రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచిన సీఎంకు తలసాని కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన యూనిట్‌ ధరకు అనుగుణంగా ఇప్పటికే డీడీలు చెల్లించిన లబ్ధిదారులు అదనపు వాటా ధనం వెంటనే చెల్లించాలని మంత్రి సూచించారు. గొల్ల, కురుములు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే గొప్ప ఆలోచనతో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. తొలి విడతలో రూ.5వేల కోట్ల వ్యయంతో గొర్రెల పంపిణీ జరిగిందన్న తలసాని.. రెండో విడతలో రూ.6వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు