KTR: హైదరాబాద్ విస్తరణ దృష్ట్యా శివార్లలో మౌలిక వసతులు: కేటీఆర్‌

హైదరాబాద్‌ రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. వచ్చే 30 ఏళ్లలో మరిన్ని

Published : 25 Jan 2022 12:21 IST

మేడ్చల్‌: హైదరాబాద్‌ రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్లు విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రూ.138 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాచుపల్లి- మల్లంపల్లి ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో నగరంలో వారానికి ఒక సారి మంచినీరు వచ్చేవన్న కేటీఆర్.. ఇప్పుడు ప్రతిరోజూ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. నగర విస్తరణ దృష్ట్యా శివారులలో మౌలిక వసతులు పెంచుతున్నామని వివరించారు. శివారు గ్రామాలన్నీ పురపాలికలుగా మారాయని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని