అధికారులూ.. తప్పులుచేస్తే ఉద్యోగాలు ఊడుతాయ్‌ జాగ్రత్త!: కేటీఆర్‌ హెచ్చరిక

పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు......

Updated : 07 Nov 2021 05:11 IST

సిరిసిల్ల: పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పోడు భూముల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామన్నారు. హరిత హారంలో మూడేళ్లలో 4.5శాతం పచ్చదనం పెరిగిందన్న మంత్రి.. అటవీ ఆక్రమణలు జరగకూడదనే హక్కు పత్రాలు అందిస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడుతాయ్‌..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అటవీ భూములపై అధికారులు కోర్టుల్లోనూ పోరాడాలని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని