Budget 2022 : పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టండి : కేటీఆర్‌

దేశంలో పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘‘ దేశంలో పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. పట్టణీకరణ వలన..

Published : 27 Jan 2022 21:36 IST

హైదరాబాద్ : దేశంలో పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు లేఖ రాశారు. ‘‘ దేశంలో పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. పట్టణీకరణ వలన పేదరికం కూడా పెరుగుతోంది. పట్టణాల్లో పేద ప్రజల ఆదాయం పెంచాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ ఉంటే పట్టణ పేదలూ కనీస అవసరాలు అందుకోగలరు. పార్లమెంటరీ స్థాయీ సంఘం, సీఐఐ కూడా సిఫార్సు చేశాయి. పట్టణ పేదల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలి.’’ అని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని