Updated : 19/05/2021 20:04 IST

CoronaCrisis: ఏపీకి ‘కియా’ భారీ విరాళం 

అమరావతి: కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో పలు సంస్థలు ఏపీ ప్రభుత్వానికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. తాజాగా కరోనా నివారణ, సహాయక చర్యలకు కియా ఇండియా భారీ సాయం అందజేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5కోట్లు విరాళం ఇచ్చింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ, సీఈవో షిమ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి విరాళం చెక్కులను అందజేశారు. ఈ నగదుతో వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, క్రయోజనిక్‌ ట్యాంకర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. 

విశాఖకు హెచ్‌పీసీఎల్‌ రూ.35లక్షలు
మరోవైపు, కొవిడ్‌ రోగులకు హెచ్‌పీసీఎల్‌ తన వంతు సాయం అందజేసింది. విశాఖ జిల్లాలో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కోసం రూ.35లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళం చెక్కును హెచ్‌పీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కలెక్టర్‌కు అందజేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని