Kadapa: వరదల్లో కొట్టుకుపోయిన భర్త ఆచూకీ కోసం ఆయేషా ఆవేదన

కళ్ల ముందే వరద వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కడదాకా తోడుంటాడనుకున్న భర్త వరదల్లో కొట్టుకుపోయాడు.

Published : 25 Nov 2021 01:49 IST

కడప: కళ్ల ముందే వరద వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కడదాకా తోడుంటాడనుకున్న భర్త వరదల్లో కొట్టుకుపోయాడు. వరద తగ్గినప్పటి నుంచి ఆమె తన భర్త కోసం వెదుకుతోంది. భర్త మృతదేహం ఆ సమీపంలోనే ఉందని చెప్పడంతో ఆమెలో కలవరం మొదలైంది. బిడ్డల్ని వెంటబెట్టుకుని కాళ్లరిగేలా తన భర్త కోసం గాలిస్తోంది. కడప జిల్లా  రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా ఆవేదన ఇది. 

వరదలో కొట్టుకుపోతున్న తన భర్తను కాపాడేందుకు తన అక్క కుమార్తె ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అయేషా తెలిపారు. తన భర్త ఆచూకీ తెలియడంలేదన్న సంగతి అతడి తండ్రికి తెలియదంటూ ఆమె భోరున విలపించారు. ఆయనకు తెలిస్తే భరించలేడని.. ఉన్న ఒక్క పెద్ద దిక్కును కూడా కోల్పోతానేమోనని భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినా.. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు. వరదల కారణంగా పోయే ప్రతి ప్రాణానికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆక్షేపించారు. ఓట్ల కోసమే తప్ప.. ఇలాంటి సమయంలో ప్రజలు కనిపించరా..? అని ప్రశ్నించారు. తన భర్త గల్లంతై ఆరు రోజులు గడిచినా.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ సహాయమూ అందలేదన్నారు. దయచేసి తన భర్తను వెతికిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

Read latest General News and Telugu News


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని