ఈ దీవిని మీరూ కొనుక్కోవచ్చు!

చుట్టూ నీరు.. మధ్యలో మీరు.. ఇల్లు కట్టుకుని ఎంచక్కా ప్రకృతి ఒడిలో సేదదీరాలని అనుకుంటున్నారా! అయితే దానికి ఏ దీవో కావాలి. మరి అలాంటి అవకాశం ఉందంటారా........

Published : 24 Mar 2021 20:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చుట్టూ నీరు.. మధ్యలో మీరు.. ఇల్లు కట్టుకుని ఎంచక్కా ప్రకృతి ఒడిలో సేదదీరాలని అనుకుంటున్నారా! అయితే దానికి ఏ దీవో కావాలి. మరి అలాంటి అవకాశం ఉందంటారా! ఇదిగో ఈ దీవిని అమ్ముతున్నారట. అదేంటో చూద్దాం రండి.. 

స్కాట్లాండ్‌కు చెందిన హైలాండ్‌లో 11 ఎకరాల దీవి ఉంది. దీన్ని ‘డీర్‌’ ఐలాండ్‌ అనీ, ‘ఈలీన్‌ ఏన్‌ ఎఫెయిద్‌’ అనీ పిలుస్తారు. అయితే ఈ ‘డీర్‌ ఐలాండ్‌’ చుట్టు పక్కల ఇళ్లులేవు. మనుషులు కూడా సంచరించరు. అలాగనీ దీన్నిప్పుడు వదిలేస్తే, ఇక జీవితంలో కొనలేరని దీన్ని అమ్మే ఏజెంట్లు చెబుతున్నారు. అందుకే ప్యూచర్‌ ప్రాపర్టీ కింద ఈ దీవిని ఇప్పుడే సొంతం చేసుకోమని సలహా ఇస్తున్నారు. కానీ అంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు? అని సందేహపడుతున్నారా? 

ఇంతకీ అసలు సంగతేంటంటే ఈ ఐలాండ్‌.. ఒకప్పుడు మొయిడార్ట్‌ రాజవంశానికి చెందిన క్లారానాల్డ్‌ అధీనంలో ఉండేదట. కానీ ప్రస్తుతానికి దీనికి యజమానులెవరూ లేరట. అందుకే అక్కడి ఏజెంట్లు దీన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ దీవిని 80 లక్షల రూపాయల (80 వేల పౌండ్లు) ప్రారంభ విలువతో వేలం పాట నిర్వహిస్తారు. అయితే బిలియనీర్లకి ఈ మొత్తం పెద్ద ఎక్కువేం కాదనుకోండి. అంతేకాక ఇలాంటి దీవిని సొంతం చేసుకోవడానికి ఎంతయినా ఖర్చు పెడతారు. కాబట్టి దీన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే ఇంకో 3 రోజులు వేచి చూడాలి. మరి మీకూ ఆ దీవిని చూడాలనుంటే జర ఓ లుక్కేయండి!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని