పోలీసుల వలయంలో అంతర్వేది
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటన నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇవాళ చలో అంతర్వేదికి భాజపా, జనసేన పిలుపునిచ్చాయి...
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటన నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇవాళ చలో అంతర్వేదికి భాజపా, జనసేన పిలుపునిచ్చాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా భాజపా, జనసేన నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
30 పోలీసు యాక్టు అమలు కారణంగా అంతర్వేదిలో పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొత్తపేటలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో భాజపా గుంటూరుజిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారు అంతర్వేదిలో అడుగుపెట్టకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇతరులు రావొద్దు: ఏలూరు రేంజ్ డీఐజీ
అంతర్వేది పరిసర ప్రాంతాల్లో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని, ఆ ప్రాంతానికి ఇతరులు రావొద్దని ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు. అంతర్వేది అగ్నిప్రమాద ఘటనాస్థలి వద్ద క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణులు ఘటనాస్థలంలో అణువణువు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!